![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -378 లో.... రామలక్ష్మికి రామ్ ఫోన్ చేసి అత్త అంటాడు. అలా అంటావేంటి రామ్ అని రామలక్ష్మి అంటుంది. పిలుపు కూడా వద్దని అంటుంది. అలాంటిది మనతో ఎలా బంధం కావాలనుకుంటుందని సీతాకాంత్ అనుకుంటాడు. మిమ్మల్ని చూడాలని ఉంది మిస్ అనగానే నాకు వర్క్ ఉందని రామలక్ష్మి అబద్ధం చెప్తుంది. రామ్ కోసం వస్తానని అంటుంది.
ఆ తర్వాత నువ్వు పసివాడి కోసం అయిన వెళ్లి తీరాలి అమ్మా కానీ జాగ్రత్తగా మసులుకోవాలి కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోకు అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి తుపాన్ వస్తుంది. ఆ మైథిలి ఇక్కడికి వస్తుందని అనగానే రామ్ చేతే దాన్ని వద్దని అనిపించేలా చేస్తానని శ్రీలత అంటుంది. రామ్ దగ్గరికి శ్రీలత జ్యూస్ తీసుకొని వెళ్తుంది. రామ్ ఇది తీసుకోమని అనగానే నాకు మా మిస్ ఇస్తేనే తాగుతానని రామ్ అంటాడు..
అప్పుడే రామలక్ష్మి వస్తుంది. మా మిస్ వచ్చింది అని రామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేడమ్ నాకు పాయసం తినాలని ఉంది చేస్తారా అని రామ్ అంటాడు. సరే అని రామలక్ష్మి కిచెన్ లోకి వెళ్ళి పాయసం రెడీ చేస్తుంది. సీతాకాంత్ తన దగ్గరికి వెళ్లి మా రామ్ వల్ల మీరు ఇబ్బంది పడొద్దు మీరు లండన్ వెళ్లిపోండి అని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి పాయసం చేసి రామ్ కి తినిపిస్తుంది. సీతాకి కూడా తినిపించు అని రామ్ అనగానే రామలక్ష్మి తినిపిస్తుంది. నువ్వు మిస్ కి తినిపించు సీతా అని రామ్ అనగానే.. రామలక్ష్మికి సీతాకాంత్ తినిపిస్తాడు. అదంతా శ్రీలత, శ్రీవల్లి, సందీప్ చూసి కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |